ఆ ఒక్క వ్యక్తి లేకపోవడంతో జీవితాలు తారుమారు.. మాజీ ఎంపీ ఉండవల్లి

Update: 2022-09-02 08:28 GMT

సంక్షేమ సారథి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయనతో అనుబంధం ఉన్న నేతలు తమ అనుభవాలను గుర్తు చేసుకుంటున్నారు. ఈరోజు కృష్ణా జిల్లా అంపాపురంలో జరిగిన డాక్డర్ వైఎస్సార్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రాజమండ్రి మాజీ ఎంపీ, సామాజికవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడారు. రాజశేఖర్ రెడ్డి సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు. పేదల కోసం పరితపించిన వ్యక్తి వైఎస్సార్ అని ఆయన అన్నారు. 2009 సెప్టెంబర్ 2న సీఎం వైఎస్సార్ హెలికాప్టర్ కనిపించకుండా పోవడంతో అంతా ఆందోళన చెందామని.. రాత్రంతా జాగారం చేశామన్నారు. ఆయన క్షేమంగా తిరిగి రావాలని ప్రజలు పూజలు చేశారని చెప్పారు. ఆయన ఇకలేరని తెలిసి కోట్లాది మంది కన్నీరు పెట్టారని.. అది జగతిలో ఒక్క వైఎస్సార్‌కే దక్కిందన్నారు. ఆయన మరణం తర్వాత రాష్ట్రం అస్తవ్యస్తం అయిపోయిందని.. ఆ ఒక్క వ్యక్తి లేకపోవడం వల్ల పేదల జీవితాలు తారుమారయ్యాయని ఆయన అన్నారు. ఇప్పటి పాలకులు కూడా ఆయనను ఆదరంగా తీసుకుని పరిపాలన కొనసాగించాలని ఆయన సూచించారు.

Tags:    

Similar News