బాలకృష్ణపై మార్గాని భరత్ సంచలన కామెంట్స్
బాలకృష్ణపై మార్గాని భరత్ సంచలన కామెంట్స్
హిందూపురం ఎమ్మెల్యే, సీనీ హీరో బాలకృష్ణపై మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా ఫంక్షన్లకు వెళ్లినట్లు అసెంబ్లీకి కూడా అలాగే వెళ్లినట్లుందని ఎద్దేవా చేశారు. బాలకృష్ణకు అసెంబ్లీకి వెళ్లేముందు బ్రీత్ అనలైజర్ తో టెస్ట్ చేయించాలన్నారు. బాలకృష్ణ మానసిక స్థితిపై అనేక అనుమానాలున్నాయన్న భరత్, నెత్తిమీద విగ్గు, దాని మీద గాగుల్స్, జేబులో చేతులు పెట్టుకుని మాట్లాడతారా? అని మార్గాని భరత్ నిలదీశారు.
మానసిక స్థితి బాగాలేదని...
మీకు తొమ్మిదో ప్లేస్ ఇచ్చి జనసేన మీ స్థాయి ఏంటో చెప్పకనే చెప్పిందని అన్నారు. అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ మాజీ ముఖ్యమంత్రిని పట్టుకునిఅలా మాట్లాడటం సిగ్గు చేటని అన్నారు. నాడు కాల్పుల కేసులో మానసిక స్థితి బాగా లేదని వైద్యుల నుంచి సర్టిఫికెట్ తెచ్చుకున్న సంగతి మర్చిపోయారా? అంటూ మార్గాని భరత్ ప్రశ్నించారు. మాట్లాడే టప్పుడు కాస్త ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడితే మంచిదని సూచించారు.