నేడు విచారణకు తోపుదర్తి ప్రకాశ్ రెడ్డి

వైఎస్ జగన్ ప్రయాణించి హెలికాప్టర్ ఘటన ధ్వంసం కేసులో ఈరోజు విచారణకు మాజీ ఎమ్మెల్యే తోపుదర్తి ప్రకాష్ రెడ్డి హాజరు కావాల్సి ఉంది

Update: 2025-05-12 03:51 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రయాణించి హెలికాప్టర్ ఘటన ధ్వంసం కేసులో ఈరోజు విచారణకు మాజీ ఎమ్మెల్యే తోపుదర్తి ప్రకాష్ రెడ్డి హాజరు కావాల్సి ఉంది.సీకే పల్లి పీఎస్ లో విచారణకు రావాలని తోపుదర్తి ప్రకాష్ రెడ్డికి పోలీసుల నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని విచారించిన పోలీసులు నేడు తోపుదర్తిని విచారించనున్నారు.

అజ్ఞాతంలో ఉన్న
అయితే తోపుదర్తి ప్రకాష్ రెడ్డి గత కొంత కాలం నుంచి అజ్ఞాతంలో ఉన్నారు. ఆయనను అరెస్ట్ చేస్తారన్న భయంతో తప్పించుకు తిరుగుతున్నారు. ఆయన కోసం హైదరాబాద్,బెంగళూరు, విజయవాడ ప్రాంతాల్లో పోలీసు బృందాలు గాలించాయి. నేడు తోపుదర్తి ప్రకాష్ రెడ్డి విచారణకు హాజరవుతారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News