ఆ గోదావరి వరదను ఎవరైనా ఆపండయ్యా?
గోదావరి నదిలో కొనసాగుతున్న వరదపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు
గోదావరి నదిలో కొనసాగుతున్న వరదపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ గోదావరి వరదను ఎవరైనా ఆపండయ్యా? అంటూ ఆయన ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతలైనా బిందెలు అడ్డు పెట్టొచ్చు కదా? అని సెటైర్ వేశారు. కనీసం కాంగ్రెస్ నేతలైనా చెంబులతో ఆపొచ్చు కదా? అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యంగంగా అన్నారు.
వృధాగా పోతున్న నీటిని...
రోజుకు 50 నుంచి 60 టీఎంసీలు సముద్రంలోకి పోతుంటే ఏం చేస్తున్నారు? అంటూ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణలోని బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సమయంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో చర్చ జరుగుతుంది.