నేడు గూడూరుకు కాకాణి గోవర్థన్ రెడ్డి
మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి నేడు జైలు నుంచి విడుదల కానున్నారు. కాకాణి గోవర్థన్ రెడ్డిపై మొత్తం ఎనిమిది కేసులు నమోదయ్యాయి.
మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి నేడు జైలు నుంచి విడుదల కానున్నారు. కాకాణి గోవర్థన్ రెడ్డిపై మొత్తం ఎనిమిది కేసులు నమోదయ్యాయి. ఎనిమిది కేసుల్లో బెయిల్ లభించింది. అయితే షరతులు విధించింది. ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్ కు హాజరు కావాలని కోరింది. విచారణ పూర్తయ్యేంత వరకూ నెల్లూరు జిల్లాలో ఉండకూడదని తెలిపింది. దీంతో ఆయన చిత్తూరు జిల్లా గూడూరులో ఉండనున్నారు. గూడులో ఆయన కోసం నివాసాన్ని కుటుంబ సభ్యులు ఏర్పాటు చేస్తున్నారు.
న్యాయస్థానం ఆంక్షలతో...
మరొకవైపు పాస్ పోర్టును కూడా న్యాయస్థానానికి సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను దాటి ఎక్కడకూ వెళ్లకూడదని కూడా న్యాయస్థానం షరతులు పెట్టింది. మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి గత 78 రోజులు నుంచి వివిధ కేసుల్లో రిమాండ్ ఖైదీగా నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్నారు. నేడు విడుదలయ్యే అవకాశముంది.