వంశీ, కాకాణి గోవర్థన్ రెడ్డిలకు ఎదురుదెబ్బ

మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి కి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ నేత వల్లభనేని వంశీకి కూడా విజయవాడ కోర్టులో ఊరట లభించలేదు

Update: 2025-04-09 12:54 GMT

మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి కి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ముందస్తు బెయిల్ పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. పిటీషన్ ను డిస్మిస్ చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ముందస్తు బెయిల్ ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది. మైనింగ్ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ కాకాణి వేసిన పిటీషన్ ను డిస్మిస్ చేసిన హైకోర్టు మరో రెండు వారాలకు విచారణకు వాయిదా వేసింది. ప్రస్తుతం కాకాణి గోవర్థన్ రెడ్డి పరారీలో ఉన్నారు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు.

వల్లభనేని వంశీకి కూడా....
వైసీపీ నేత వల్లభనేని వంశీకి కూడా విజయవాడ కోర్టులో ఊరట లభించలేదు. విజయవాడలో పది సెంట్ల భూమిని కబ్జా చేశారంటూ వల్లభనేని వంశీపై నమోదయిన కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కోర్టులో పిటీషన్ వేశారు. దీనిపై విచారించిన విజయవాడ కోర్టు తాము ముందస్తు బెయిల్ ను మంజూరు చేయలేమని ఉత్తర్వులు జారీ చేసింది. వల్లభనేని వంశీ రిమాండ్ ఖైదీగా విజయవాడ జిల్లా జైలు లో ఉన్నారు. ఆయనపై నమోదయిన కేసుల్లో కొన్నింటిలో బెయిల్ లభించినా మరికొన్నింటిలో లభించలేదు.


Tags:    

Similar News