వైఎస్ జగన్ పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడం వెనక కుట్ర

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హెలికాప్టర్ లో రమ్మనడం వెనుక కుట్ర కోణం ఏంటని మాజీ మంత్రి గుడివాడ అమర్ నాధ్ ప్రశ్నించారు.

Update: 2025-10-08 03:38 GMT

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హెలికాప్టర్ లో రమ్మనడం వెనుక కుట్ర కోణం ఏంటని మాజీ మంత్రి గుడివాడ అమర్ నాధ్ ప్రశ్నించారు. రేపు విశాఖలో జగన్ పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. తాము జగన్ పర్యటనకు అనుమతి ఇవ్వాలని కోరలేదేని, పోలీసులు కేవలం భద్రత కల్పించాలని మాత్రమే అడిగామని గుడివాడ అమర్ నాధ్ అన్నారు.

పార్టీ శ్రేణులే అండగా ఉంటారని...
ఎట్టిపరిస్థితుల్లో ఎల్లుండి ఆయన పర్యటన ఉంటుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఏజెన్సీలో వాతావరణ పరిస్థితులు బాగాలేవని తెలిసినా, పోలీసులు హెలికాప్టర్లో రమ్మనడం వెనుక కుట్ర కోణం ఏంటని ప్రశ్నించారు. సమస్యలు చెప్పుకోవడానికి ప్రజలు జగన్ వద్దకు వస్తారని, పోలీసులు భద్రత కల్పించకుంటే పార్టీ శ్రేణులే సెక్యూరిటీగా ఉంటారని అన్నారు


Tags:    

Similar News