పొత్తులపై గంటా ఏమన్నారంటే?

కన్నా లక్ష్మీనారాయణతో గంటా శ్రీనివాసరావు భేటీ అయ్యారు. గుంటూరులో ఆయన నివాసంలో సమావేశమయ్యారు

Update: 2023-04-01 08:01 GMT

కన్నా లక్ష్మీనారాయణతో గంటా శ్రీనివాసరావు భేటీ అయ్యారు. గుంటూరులో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. పొత్తులు, సీట్లు వ్యవహారాలు ఎన్నికల సమయంలోనే చెబుతామని తెలిపారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను సెమీ ఫైనల్స్ అన్న వారు ఎటు వెళ్లారని గంటా ప్రశ్నించారు. అక్కడ వైసీపీ ఇన్‌ఛార్జి వైవీ సుబ్బారెడ్డి రాజధానికి రిఫరెండం అని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. నిన్న రాజధానిలో రాజధాని రైతుల దాడుల వెనక కూడా ప్రభుత్వం పెద్దల హస్తం ఉందని గంటా ఆరోపించారు.

సవాల్ స్వీకరిస్తారా?
తమ అభ్యర్థి చిరంజీవి గెలిచాడు కాబట్టి అధికార వైసీపీ అధికారం నుంచి తప్పుకుని ఎన్నికలకు సిద్ధమవ్వాలని గంటా శ్రీనివాసరావు సవాల్ విసిరారు. అలాగే టీడీపీ ఈసారి అధికారంలోకి రావడం ఖాయమని, రాష్ట్రంలో క్లీన్ స్వీప్ చేస్తుందని గంటా శ్రీనివాసరావు జోస్యం చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం పట్ల క్షేత్ర స్థాయిలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎక్కువగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఓట్లు చీల్చనివ్వబోమని పవన్ కల్యాణ్ చెప్పారని, అందుకే పొత్తుల గురించి ఇప్పటికిప్పడు ఆలోచించి ప్రయోజనం లేదని, ఎన్నికల సమయంలోనే దానిపై చర్చిస్తామని తెలిపారు.


Tags:    

Similar News