జగన్ ఢిల్లీ పర్యటన అందుకే

బాబాయ్ హత్య కేసులో నిందితులను కాపాడటం కోసమే ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీని కలిశారని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు

Update: 2022-08-23 08:26 GMT

బాబాయ్ హత్య కేసులో నిందితులను కాపాడటం కోసమే ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీని కలిశారని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. కనీసం ప్రధానిని ఏం కోరిందీ చెప్పుకోలేని నిస్సహాయతతో జగన్ ఉన్నారన్నారు. డర్టీ ఎంపీని కాపాడేందుకు, 20 వేల కోట్ల బీచ్ శాండ్ అవినీతి నుంచి బయటపడేందుకే జగన్ మోదీని కలిశారే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని దేవినేని ఉమ ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుకు తాత్కాలిక సాయం అందించమని కోరినట్లు తాను మీడియాలో చూశానని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ ఎన్ని సార్లు ఢిల్లీకి వెళ్లినా రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనం లేదన్నారు.

అన్నింటినీ తాకట్టు పెట్టి....
2019లోనే చంద్రబాబు పోలవరానికి 55,548 కోట్ల రూపాయల ఆమోదం తీసుకు వచ్చారని దేవినేని ఉమ గుర్తు చేశారు. తమ ప్రభుత్వంలో 72 శాతం పనులను పూర్తిచేశామని తెలిపారు. ప్రజలను కూడా బస్సులను పెట్టి ప్రాజెక్టు పురోగతిని చూపించామని తెలిపారు. ఇప్పుడు ప్రాజెక్టు పరిశీలనకు ఎవరినీ అనుమతించడం లేదన్నారు. ఎంపీ మాధవన్ ను కాపాడటానికి పోలవరం ప్రాజెక్టును తాకట్టు పెట్టారన్నారు. నిర్వాసితులకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. ప్రధానిని పదే పదే కలవడం తప్ప రాష్ట్రానికి ఒక్క రూపాయి తెచ్చింది లేదని దేవినేని ఉమ ఫైర్ అయ్యారు. జగన్ రాష్ట్ర ద్రోహిగా మిగిలిపోతాడని ఆయన ధ్వజమెత్తారు.


Tags:    

Similar News