వీరమల్లు కి వీరతాడు అంటూ అంబటి ట్వీట్

మాజీ మంత్రి అంబటి రాంబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై ఘాటు ట్వీట్ చేశారు

Update: 2025-05-29 04:03 GMT

మాజీ మంత్రి అంబటి రాంబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై ఘాటు ట్వీట్ చేశారు. అంబటి రాంబాబు మీడియా సమావేశాల్లో గాని, ట్వీట్లలో గాని చంద్రబాబుతో సరిసమానంగా పవన్ కల్యాణ్ ను కూడా విమర్శ చేస్తారు. అధికారం కోల్పోయిన నాటి నుంచి కూడా అంబటి రాంబాబు పవన కల్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని ట్వీట్లు చేస్తున్నారు.

సినిమా వాళ్లకే...
తాజాగా మాజీ మంత్రి అంబటి రాంబాబు పవన్ కల్యాణ్ పై మరోసారి ట్వీట్ చేశారు. హామీలు ఎగొట్టి పాప్ కార్న్, ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్ చవక చేసేందుకు సినిమా వాళ్లకే సినిమా చూపిస్తున్న వీరమల్లు కి వీరతాడు అంటూ పవన్ కల్యాణ్ ను విమర్శిస్తూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ట్వీట్ ను పవన్ కల్యాణ్ కు ట్యాగ్ చేశాడు.


Tags:    

Similar News