Ambat Rambabu : హామీలకు ఎగనామం పెట్టాలనే ఈ సాకులు

అప్పుల పేరుతో చంద్రబాబు హామీలకు ఎగనామం పెట్టాలని చూస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు

Update: 2025-01-27 12:57 GMT

అప్పుల పేరుతో చంద్రబాబు హామీలకు ఎగనామం పెట్టాలని చూస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలకు అంబటి కౌంటర్ ఇచ్చారు. అప్పులు బూచిగా చూపి తప్పించుకోవాలని చూస్తున్నారని అంబటి అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు అసలు నిజం చెప్పారన్నారు. ప్రజలను భ్రమల్లో పెట్టి ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్న చంద్రబాబు ఇప్పుడు ఎగవేసేందుకు అనేక రకాల సాకులు చూపుతున్నారన్నారు. ఎన్నికల సందర్భంగా తాము 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశామని చెప్పారని, అయితే అంత కంటే జగన్ తక్కువగానే అప్పులు చేశారన్నారు.

2014 నుంచి ఇప్పటి వరకూ...
రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకూ అప్పులు ఆరు లక్షల కోట్ల రూపాయలు అప్పులు మాత్రమే ఉన్నాయని తెలిపారు. హామీలు అమలు చేయలేక పోతున్నామని సుదీర్ఘ ప్రసంగాలు చేస్తున్నారని అంబటిరాంబాబు తెలిపారు.దావోస్ వెళ్లి చంద్రబాబు ఏం చేశారని, ఏం సాధించారని, అందుకు ఎంత ఖర్చు చేశారో చెప్పాలంటూ అంబటి రాంబాబు చంద్రబాబు ను డిమాండ్ చేశారు. జగన్ దావోస్ కు వెళ్లి లక్షల కోట్ల రూపాయలపెట్టుబడులతో ఒప్పందాలు చేసుకుని వచ్చారన్నారు.చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతూ కాలం గడుపుతున్నారన్నారు.


Tags:    

Similar News