Vallabhaneni Vamsi : గుంటూరు ఆసుపత్రిలో వల్లభనేని వంశీ
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రికి తీసుకొచ్చారు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రికి తీసుకొచ్చారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో వల్లభనేని వంశీ ఇబ్బంది పడుతున్నారు. దగ్గు, ఆయాసంతో ఉన్న వల్లభనేని వంశీని వైద్య పరీక్షల కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వచ్చారు. అక్కడ వల్లభనేని వంశీకి వైద్య పరీక్షలను నిర్వహించనున్నారు.
రిమాండ్ లో ఉన్న...
నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అస్వస్థతకు గురికావడంతో కంకిపాడు ఆస్పత్రిలో వైద్యం అందించిన పోలీసులు మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్‍కు వల్లభనేని వంశీ తరలించారు. వల్లభనేని వంశీ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తనకు బెయిల్ ఇవ్వాలంటూ వేసిన పిటీషన్ పై నేడు విచారణ జరగనుంది.