Ys Jagan : నేడు జగన్ పిటీషన్ పై హైకోర్టులో విచారణ
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వడంపై స్పీకర్ ఇచ్చిన రూలింగ్ పై పిటీషన్ వేశారు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వడంపై స్పీకర్ ఇచ్చిన రూలింగ్ పై పిటీషన్ వేశారు. నేడు స్పీకర్ రూలింగ్స్ పై హైకోర్టులో విచారణ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గత ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసిన మిత్ర పక్షాలు మాత్రమే సభ్యులుగా ఉన్నారని, వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ జగన్ పిటీషన్ వేశారు.
ప్రతిపక్ష హోదాపై...
అయితే ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు తిరస్కరిస్తూ స్పీకర్ ఈ ఏడాది ఫిబ్రవరి 5వతేదీన రూలింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. స్పీకర్ రూలింగ్ ను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టును కోరారు. దీనిపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.