Ys Jagan : హైకోర్టును ఆశ్రయించిన వైఎస్ జగన్‌

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదయిన కేసును కొట్టివేయాలంటూ క్వాష్ పిటీషన్ వేశారు

Update: 2025-06-25 11:42 GMT

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదయిన కేసును కొట్టివేయాలంటూ క్వాష్ పిటీషన్ వేశారు. జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా ఆయన ప్రయాణిస్తున్న వాహనం కింద పడి సింగయ్య మృతి చెందారు. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్ తో పాటు ఆయన కారు డ్రైవర్ రమాణారెడ్డి, పీఏ నాగేశ్వర్ రెడ్డి, వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజని నిందితులుగా చేర్చారు.

అన్నింటినీ కలిపి...
దీంతో వీరందరూ కలసి క్వాష్ పిటీషన్ వేశారు. అయితే నిన్న క్వాష్ పిటీషన్ దాఖలు చేసిన పేర్ని నాని, విడదల రజని పిటీషన్లను పరిశీలించిన న్యాయస్థానం రేపు వీటితో పాటు జగన్ ఇతరుల వేసిన క్వాష్ పిటీషన్ పై కూడా విచారణ చేపడతామని న్యాయస్థానం తెలిపింది. రేపు అన్ని పిటీషన్లను ఒకేసారి హైకోర్టు ధర్మాసనం విచారించనుంది.


Tags:    

Similar News