బన్నీ ఉత్సవానికి అంతా సిద్ధం

దేవరగట్టు ఉత్సవానికి అంతా సిద్ధమయింది. కర్నూలు జిల్లా దేవరగట్టులో జరిగే ఈ ఉత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యా

Update: 2022-10-05 02:31 GMT

దేవరగట్టు ఉత్సవానికి అంతా సిద్ధమయింది. కర్నూలు జిల్లా దేవరగట్టులో జరిగే ఈ ఉత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఏడాది దేవరగట్టులో దసరా రోజు రాత్రి కర్రలతో సమరం జరుగుతుంది. అయితే పోలీసులు ఈ కార్యక్రమానికి అనుమతిని నిరాకరించారు. తలలు పగులుతాయి. రక్తం చిందుతుంది. అలాంటి అవకాశం లేకుండా పోలీసులు బన్ని ఉత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు దేవరగట్టు గ్రామంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆలూరు నియోజకవర్గంలో ఉన్న దేవరగట్టులో ప్రతి ఏడాది కర్రల సమరం మామూలుగానే జరుగుతుంది.

పోలీసులు వారిస్తున్నా...
సంప్రదాయ కార్యక్రమంగా ప్రజలు దీనిని భావిస్తారు. రెండు గ్రామాల ప్రజలు దేవుడిని తమ గ్రామానికి తీసుకెళ్లేందుకు కర్రలతో యుద్ధం చేసుకుంటారు. ఈరోజు అర్థరాత్రి గ్రామంలో కల్యాణం నిర్వహిస్తారు. కర్రల సమరంలో అనేక మందికి తీవ్రగాయాలవుతాయి. అందుకోసం అక్కడ ప్రత్యేకంగా ప్రాధమిక చికిత్స అందించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తారు. నెరణికి, నెరణికితండా, కొత్తపేట గ్రామాల ప్రజలు ఒక వర్గంగా, ఆలూరు, సుళువాయి, ఎల్లార్తి, అరికెర, నిడ్రవట్టి గ్రామాల ప్రజలు మరొక వర్గంగా ఏర్పడి కర్రలతో కొట్టుకుంటారు. దేవుడిని ఎవరు దక్కించుకుంటారన్నది ఇక్కడ ముఖ్యమైన విషయం. ఈ సమరాన్ని చూసేందుకు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా వస్తారు. ఈ కర్రల సమరానికి పోలీసులు అనుమతించడం లేదు. అయితే సంప్రదాయంగా వస్తున్న ఆచారాన్ని కొనసాగిస్తామని గ్రామస్థులు చెబుతున్నారు.


Tags:    

Similar News