Big Breaking : ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ ఎంట్రీ.. ఇరవై చోట్ల సోదాలు

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు

Update: 2025-09-18 07:04 GMT

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం ఇరవై చోట్ల ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో 3,500 కోట్ల సొమ్మును దారిమళ్లించారన్న ఆరోపణలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ఐదు రాష్ట్రాల్లో లింకులు...
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం పన్నెండు మందిని అరెస్ట్ చేసింది. పన్నెండు మంది నిందితుల్లో నలుగురికి బెయిల్ లభించింది. ఈ కేసును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా తీసుకుని విచారణ చేస్తున్నారు. నకిలీ ఇన్వాయిస్, పెంచిన మద్యం ధరలతో అక్రమంగా సొమ్ములు వివిధ ప్రాంతాలకు చేరవేసినట్లు ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఈ స్కామ్ కు సంబంధించి ఐదు రాష్ట్రాల్లో లింకులున్నాయని భావించి ఈ సోదాలను ఈడీ అధికారులు నిర్వహిస్తున్నార.


Tags:    

Similar News