తిరుపతిలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల సోదాలు
తిరుపతికి సమీపంలో రేణిగుంటలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు
తిరుపతికి సమీపంలో రేణిగుంటలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. చైనా దేశానికి చెందిన డోయాంగ్ నివాసంలో ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే పక్కాగా అందిన సమాచారం మేరకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అతని ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారని స్థానిక అధికారులు తెలిపారు.
రేణిగుంటలో ఉన్న...
తిరుపతి జిల్లాలోని రేణిగుంటలో చైనా దేశానికి చెందిన డోయాంగ్ పై వీసా తేదీ గడువు ముగిసినప్పికీ ఇండియాలోనే ఉన్నారని గతంలో కేసు నమోదు అయింది. ఈరోజు అతని నివాసంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతూ ఉంది. అతను అకౌంట్స్ కు సంబంధించిన బ్యాంక్ అధికారులు అతని అకౌంట్ ను సీజ్ చేశారు. అలాగే వీళ్ళకు సంబంధించిన గోదాములోనూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు నిర్వహిస్తున్నారు.