Breaking : మరోసారి భారీ ఎన్ కౌంటర్ .. ఆరుగురు మావోల మృతి

మారేడుమిల్లిలో మరోసారి భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో మరో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు

Update: 2025-11-19 03:42 GMT

మారేడుమిల్లిలో మరోసారి భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో మరో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈరోజు ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో ఆరుగురు మావోయిస్టులు మరణించినట్లు తెలిసింది. నిన్నటి నుంచి మారేడుమిల్లి అడవుల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ గాలింపు చర్యల్లో భాగంగా ఈరోజు ఉదయం కూడా మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.

ఈరోజు ఉదయం...
అయితే ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మరణించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. నిన్న జరిగిన ఎన్ కౌంటర్ లో ఆరుగురు మావోయిస్టులు చనిపోగా, ఈరోజు మరొక ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు. ఇంకా ఎన్ కౌంటర్ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. మృతి చెందిన మావోయిస్టుల వివరాలను అధికారికంగా ప్రకటిచంలేదు.


Tags:    

Similar News