ఆళ్ల నాని చేరికపై టీడీపీ ఎమ్మెల్యే బడేటి బిగ్ కామెంట్స్
ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య ఆళ్ల నాని చేరికపై సంచలన కామెంట్స్ చేశారు.
మాజీ మంత్రి ఆళ్ల నాని టీడీపీలో చేరికపై అసంతృప్తులు చల్లారలేదు. ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య ఆళ్ల నాని చేరికపై సంచలన కామెంట్స్ చేశారు. అధినాయకత్వం ఆదేశాలను కాదనలేక ఆళ్ల నాని చేరికను కాదనలేకపోయానని బడేటి చంటి తెలిపారు. అంతే తప్ప కొందరిపై అసంతృప్తి ఎప్పటికీ మాసిపోదని ఆయన వ్యాఖ్యానించారు.
అసంతృప్తి చల్లారేది కాదు...
కొందరు అధికారంలో ఉన్న పార్టీలకు మారుతుంటారని, అలాంటి వారికి విలువ ఉండదని బడేటి చంటి అన్నారు. నియోజకవర్గంలో కార్యకర్తలతో పాటు నేతలు వ్యతిరేకిస్తున్నా అధినాయకత్వం సూచనమేరకే చేరికకు అంగీకరించానని తెలిపారు. అసంతృప్తి చల్లారిస్తే చల్లారేది కాదని కూడా బడేటి రాధాకృష్ణయ్య వ్యాఖ్యానించడంతో ఆళ్ల నాని చేరిక ఎవరికీ ఇష్టం లేకుండానే జరిగిందని తేలింది.