నేడు ఏపీలో ఎన్నికలు.. టెన్షన్ వాతావరణం
తిరుపతి, నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్లకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది
తిరుపతి, నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్లకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. దీంతో ఈ ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు భారీగా బందోబస్తును నిర్వహిస్తున్నారు. 144 సెక్షన్ విధించారు. కార్పొరేషన్ కార్యాలయంలోకి ఈరోజు ఎవరికీ అనుమతి లేదని తెలిపారు. ఇక నందిగామ, హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ పదవి కోసం కూడా ఎన్నికలు జరగనున్నాయి.
క్యాంప్ లకు తరలించి...
అయితే ఇప్పటికే టీడీపీ, వైసీపీలు తమ పార్టీలకు చెందిన కార్పొరేటర్లను క్యాంప్ లకు తరలించారు. నేరుగా కార్పొరేషన్ ఎన్నికలకు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. తమ వార్డు కార్పొరేటర్లను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుండటంతో రెండు పార్టీలు హోరాహోరాగా పోరాడుతుండటంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు.