నేడు తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక.. టెన్షన్

నేడు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ లో డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది.

Update: 2025-02-04 02:54 GMT

నేడు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ లో డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. నిన్న కోరం లేకపోవడంతో వాయిదా పడిన సమావేశం నేడు జరగనుంది. ఇప్పటికే టీడీపీ, వైసీపీలు తమకు సంబంధించిన కార్పొరేటర్లతో క్యాంప్ లను నిర్వహించాయి. తిరుపతిలో ఈరోజు ఉదయం టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ జరగడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టారు.

రెండు పార్టీలూ ....
డిప్యూటీ మేయర్ ఎన్నికలో గెలవాలని రెండు పార్టీలూ పట్టుదలతో ఉన్నాయి. యాభై మంది కార్పొరేటర్లున్న తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ లో ఇప్పటికే టీడీపీ బలం పెరగడంతో తమ కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాము ఎవరినీ కిడ్నాప్ చేయలేదని, ఈ ఎన్నికల్లో గెలుపు తమదేనని టీడీపీ, జనసేన నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలో హై టెన్షన్ వాతావరణం ఏర్పడటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News