తిరుపతి ఎన్నిక రేపటికి వాయిదా
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ లో డిప్యూటీ మేయర్ పదవికి ఎన్నిక వాయిదా పడింది.
ys jgans tour in tirumala
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ లో డిప్యూటీ మేయర్ పదవికి ఎన్నిక వాయిదా పడింది. కోరం లేకపోవడంతో రేపటికి ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. యాభై మంది కార్పొరేటర్లున్న తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కోరం కావాలంటే ఇరవై ఐదు మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉంది. కానీ నేడు సమావేశానికి 23 మంది కార్పొరేటర్లు మాత్రమే హాజరయ్యారు.
ఇరు వర్గాలు తమ వాదనలు...
వైసీపీ కార్పొరేటర్లను బెదిరించి తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుండగా, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని వారే తమ పార్టీలోకి వస్తున్నారని కూటమి పార్టీల నేతలు చెబుతున్నారు. తమ కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారంటూ వైసీపీ ఆరోపిస్తుండగా, తమకు అంత అవసరం లేదని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు చెబుతున్నారు. రేపు ఉదయం పదకొండు గంటలకు తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుందని అధికారులు ప్రకటించారు.