High Court : వాలంటీర్ల రాజీనామాతో తమకు సంబంధం లేదు
వాలంటీర్ల రాజీనామాతో తమకు సంబంధం లేదని హైకోర్టుకు ఎన్నికల కమిషన్ తెలిపింది
andhra pradesh high court
వాలంటీర్ల రాజీనామాతో తమకు సంబంధం లేదని హైకోర్టుకు ఎన్నికల కమిషన్ తెలిపింది. వాలంటీర్ల రాజీనామాల పిటీషన్ పై జరిగిన విచారణలో ఈసీ తరుపున న్యాయవాది మాట్లాడుతూ ఇప్పటి వరకూ 62 వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారని అన్నారు. తాము 900 మంది వాలంటీర్లపై చర్యలు తీసుకున్నామని తెలిపారు.
62 వేల మంది...
అయితే ఎన్నికల విధులలో వాలంటీర్లు పాల్గొనరని, వారిని దూరంగా ఉంచామని, వారి రాజీనామాలతో తమకు సంబంధం లేదని తెలిపారు. అయితే వారి రాజీనామాలు ఆమోదిస్తే వైసీపీకి అనుకూలంగా ఉంటారని పిటీషనర్ తరుపున న్యాయవాది చెప్పారు. అయితే దీనిపై వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.