Andhra Pradesh : ఏపీలో మరో ఎన్నికకు షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్ లో మరో ఎన్నికకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ను విడుదల చేసింది

Update: 2025-04-16 04:14 GMT

ఆంధ్రప్రదేశ్ లో మరో ఎన్నికకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ను విడుదల చేసింది. వైసీపీ ఎంపీ గా ఉన్న విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏర్పడిన ఖాళీగా ఉన్న స్థానాన్ని భర్తీ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 29వ తేదీ వరకూ ఈ ఎన్నిక కోసం నామినేషన్లను స్వీకరించనున్నారు. 30వ తేదీన నామినేషన్లను పరిశీలించనున్నారు.

కూటమి ఖాతాలోనే...
మే 2వ తేదీ వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువుగా నిర్ణయించారు. మే 9వ తేదీన ఎన్నికను నిర్వహించనున్నారు. అదే రోజు ఐదు గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే పోటీ ఉండకపోవచ్చు. శాసనసభ్యుల బలాబలాల ఆధారంగా జరిగే ఎన్నిక కావడంతో కూటమి ఖాతాలోనే ఈ రాజ్యసభ స్థానం దక్కనుంది. అందుకే పోలింగ్ లేకుండానే ఎన్నిక పూర్తయ్యే అవకాశాలున్నాయి.


Tags:    

Similar News