Simhachlam : సింహాచలం మృతులు వీరే

సింహాచలం చందనోత్సవంలో గోడ కూలడంతో ఎనిమిది మంది మరణించారు.

Update: 2025-04-30 04:15 GMT

సింహాచలం చందనోత్సవంలో గోడ కూలడంతో ఎనిమిది మంది మరణించారు. వీరిలో ఏడుగురిని కేజీహెచ్ కు తరలించారు. మరణించిన వారిలో ముగ్గురు వివరాలు మాత్రమే తెలిశాయి. ఎడ్ల వెంకటరావు (45), పత్తి దుర్గస్వామి నాయుడు (33), కుంపట్ల మణికంఠ ఈశ్వర శేషరావు (28)గా గుర్తించామని కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద తెలపిారు.

ఇద్దరు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన...
వీళ్లలో ఇద్దరు పశ్చిమ గోదావరికి చెందిన వారని, మరొకరు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి అని ఆయన తెలిపారు. కాగా సింహాచలం ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు పీఎం సహాయ నిధి నుంచి రెండు లక్షల రూపాయలు, గాయపడిన వారికి ఒక్కొక్కరికి యాభై వేల రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించారు.


Tags:    

Similar News