ప్రకాశంలో భూప్రకంపనలు
ప్రకాశం జిల్లా ముండ్లమూరులో భూప్రకంపనలు సంభవించాయి. రెండు సెకన్ల పాటు భూమి కంపించిందని ప్రజలు చెబుతున్నారు.
afghanistan and tajikistan earthquakes
ప్రకాశం జిల్లా ముండ్లమూరులో భూప్రకంపనలు సంభవించాయి. రెండు సెకన్ల పాటు భూమి కంపించిందని ప్రజలు చెబుతున్నారు. దీంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. గతంలోనూ ఇలాంటి ప్రకంపనలే సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు.
భయంతో...
అయితే ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రకంపనల కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు.