Earth Quake : ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం
ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. జిల్లాలోని ముండ్లమూరులో అర్ధరాత్రి 12.47 నిమిషాలకు భూమి స్వల్పంగా కనిపించింది.
ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. జిల్లాలోని ముండ్లమూరులో అర్ధరాత్రి 12.47 నిమిషాలకు భూమి స్వల్పంగా కనిపించింది. దీంతో నిద్రలో ఉన్న ప్రజలు భయపడి ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. కేవలం నాలుగు సెకన్లు పాటు భూమి ప్రకంపనాలు సంభవించాయని ముండ్లమూరు మండల ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు.
తరచూ భూ ప్రకంపనలు...
ముండ్లమూరు ప్రాంతంలో తరచూ భూప్రకంపనలు సంభవిస్తున్నాయని ప్రజలు చెబుతున్నారు. దీనికి కారణమేంటో తెలియడం లేదని, అయితే ఈ భూప్రకంపనల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు. అయితే దీనిపై అధికారులు తమకు పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వాలని ముండ్లమూరు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.