Indrakiladri : నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రులు

నేటి నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి.

Update: 2025-09-22 01:51 GMT

నేటి నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఈరోజు నుంచి మొత్తం పదకొండు రోజుల పాటు శరన్నవరాత్రులు జరగనునున్నాయి. నేటి నుంచి అక్టోబరు 2వ తేదీ వరకూ శరన్నవరాత్రులు కొనసాగనున్నాయి. అమ్మవారు నేడు బాల త్రిపుర సుందరీ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. ఉదయం నుంచే భక్తులు క్యూ లైన్ లో నిల్చుని ఉన్నారు. అమ్మవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు.

మొత్తం పదకొండు రోజులు...
బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువు దీరిన అమ్మవారిని దసరా శరన్నవరాత్రుల్లో దర్శించుకునేందుకు లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ముఖ్యంగా మూలా నక్షత్రం రోజున లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. దీంతో ఆలయ కమిటీతో పాటు అధికారులు భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొండ మీదకు ఇతర వాహనాలను అనుమతించరు. కేవలం వీఐపీ వాహనాలను మాత్రమే అనుమతించనున్నారు.


Tags:    

Similar News