Sirsailam : శ్రీశైలంలో నేడు శరన్నవరాత్రి ఉత్సవాలు

శ్రీశైలం మాహాక్షేత్రం లో అంగరంగ వైభవంగా దసరా మహోత్సవాలు జరుగుతున్నాయి.

Update: 2025-10-01 03:59 GMT

శ్రీశైలం మాహాక్షేత్రం లో అంగరంగ వైభవంగా దసరా మహోత్సవాలు జరుగుతున్నాయి. పదవ రోజైన నేడు రమావాని సేవిత రాజరాజేశ్వరి అలంకారంలో భక్తులకు భ్రమరాంబ దేవి అమ్మవారు దర్శనమివ్వనున్నారు. ఈరోజు రాత్రికి అశ్వవాహన సేవలో పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు ద ఆది దంపతులు ర్శనమివ్వనుండటంతో అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశముంది.

పట్టు వస్త్రాలను...
దసరా మహోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరుపున నేడు స్వామి అమ్మవార్ల కు పట్టు వస్త్రాలు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి సమర్పించనున్నారు. శ్రీశైలంలో దసరా మహోత్సవాల సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.


Tags:    

Similar News