Remal : మత్య్యకారులకు చేపలవేటపై నిషేధం... ఎప్పటి వరకూ అంటే?

రేమాల్ తుపాను కారణంగా సోమవారం వరకూ మత్స్యాకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశించారు

Update: 2024-05-26 02:58 GMT

తూర్పుమధ్య బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం తుపానుగా బలపడుతుందని ఉత్తరంవైపుగా కదులుతూ ఉదయానికి తీవ్రతుపానుగా మారి అర్ధరాత్రి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరాల సమీపంలో సాగర్ ద్వీపం-ఖేపుపరా మధ్య తీరం దాటే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వివరించారు. సోమవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని సూచించారు.

ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు...
దక్షిణ కేరళ పరిసరాల్లో సముద్రమట్టానికి సగటున 5.8కిమీ వరకు ఆవర్తనం విస్తరించి ఉందని మరో ఆవర్తనం ఈశాన్య మధ్యప్రదేశ్ సమీపంలో విస్తరించిందని తెలిపారు. రాజస్థాన్ నుండి మధ్యప్రదేశ్ , విదర్భ మీదుగా తెలంగాణ వరకు ద్రోణి కొనసాగుతుందన్నారు.వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వర్షాల నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


Tags:    

Similar News