పెన్నా నది ఉగ్రరూపం

భారీ వర్షాలతో పెన్నా నది ఉగ్రరూపం దాల్చింది. నెల్లూరు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పెన్నా నదిలో ఉధృతి కొనసాగుతుంది

Update: 2022-12-12 06:52 GMT

భారీ వర్షాలతో పెన్నా నది ఉగ్రరూపం దాల్చింది. నెల్లూరు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పెన్నా నదిలో ఉధృతి కొనసాగుతుంది. సోమశిల జలాశయానికి కూడా వరద నీరు చేరింది. దీంతో మూడు క్రస్ట్ గేట్లను ఎత్తి పెన్నా డెల్టాకు విడదల చేయడంతో మరింత వరద నీరు పెన్నా నదికి చేరుకుంటుంది.

వణికిస్తున్న వర్షాలు...
దీంతో పెన్నా నది పరివాహక ప్రాంతాల ప్రజలను నీటి పారుదల శాఖ అధికారులు అప్రమత్తం చేశారు. పెన్నా నదికి సమీప గ్రామాల్లోని ప్రజలు భయంగుప్పిట్లో బతుకుతున్నారు. స్వర్ణముఖి, కాళంగి, కైవల్య, పంబలేరు నదుల్లోనూ నీటి ప్రవాహం పెరిగిందని అధికారులు చెప్పారు. మరో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల ఆ ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు.


Tags:    

Similar News