ఏపీ డిఎస్సీలో వారికి ఫీజు నుంచి మినహాయింపు

ఆంధ్రప్రదేశ్ లో డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చింది. ఫీజుల చెల్లింపులో క్లారిటీ ఇచ్చింది

Update: 2025-04-21 02:32 GMT

ఆంధ్రప్రదేశ్ లో డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చింది. అయితే ఇందుకు దరఖాస్తు చేసుకోవడంపై పలు అనుమానాలను కలుగుతున్నాయి. అర్హత ఉన్న వారంతా ఈపరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో కొందరికి ఫీజు నుంచి మినహాయింపు లు కూడా ఇవ్వనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కార్యాలయం తెలిపింద.ి

గత ప్రభుత్వ హయాంలో...
ఏపీలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ లో దరఖాస్తు సమయంలో ఫీజు కట్టే విషయంపై కొందరు అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. గతేడాది వైసీపీ హయాంలో డీఎస్సీ నోటిఫికేషన్కు దరఖాస్తు చేసుకున్నవారు ప్రస్తుతం ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని నోటిఫికేషన్ లో పేర్కొంది. కేవలం అప్లికేషన్ ఫిల్ చేసి దరఖాస్తు చేస్తే సరిపోతుందని వెల్లడించింది. ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకుంటే మాత్రం మరో 750 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News