నాటకీయ పరిణామాలు.. కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్ట్

క్వార్ట్జ్ మైనింగ్ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Update: 2025-05-26 10:03 GMT

క్వార్ట్జ్ మైనింగ్ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు సమీపంలో ఏపీ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.


నెల్లూరు జిల్లాలో అక్రమంగా ఖనిజ సంపదను వెలికితీసి, రవాణా చేశారన్న ఆరోపణలపై గనులు, భూగర్భ వనరుల శాఖ ఫిర్యాదు మేరకు కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న కాకాణి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఆయనకు ఎలాంటి ఉపశమనం లభించలేదు.

Tags:    

Similar News