గుడ్ న్యూస్.. ఆదివారమూ రేషన్ దుకాణాలు తెరిచే ఉంటాయ్

ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుంచి రేషన్ షాపుల్లో సరుకుల పంపిణీ జరుగుతుంది

Update: 2025-05-31 05:09 GMT

ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుంచి రేషన్ షాపుల్లో సరుకుల పంపిణీ జరుగుతుంది. ఇందుకు సంబంధించి సరుకుల పంపిణీకి ఏర్పాట్లు చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రేషన్ కార్డులు ఉన్నవారంతా రేషన్ దుకాణాలకు వెళ్లి తమ సరుకులను తెచ్చుకోవాలని తెలిపారు. వృద్ధులు, వికలాంగులకు ఇంటివద్దకే సరుకులను పంపిణీ చేస్తామని చెప్పారు.

ఆదివారం కూడా...
అయితే ఆంధ్రప్రదేశ్ లో లబ్ధిదారులు ఏ రేషన్ షాపులో అయినా సరుకులు తీసుకోవచ్చని నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఆదివారాలు కూడా సరుకులు పంపిణీ చేయాలని మంత్రి మనోహర్ ఆదేశాలు జారీ చేశారు. మిగిలిన రోజుల్లో పనులకు వెళ్లే అవకాశమున్నందున ఆదివారాలు, సెలవు దినాల్లో కూడా సరుకులను పంపిణీ చేయాలని ఆదేశించారు.


Tags:    

Similar News