Andhra Pradesh : నేటి నుంచి రేషన్ దుకాణాల్లో సరుకుల పంపిణీ

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి రేషన్ దుకాణాల్లో సరుకుల పంపిణీ జరుగుతుంది

Update: 2025-06-01 02:34 GMT

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి రేషన్ దుకాణాల్లో సరుకుల పంపిణీ జరుగుతుంది. పిఠాపురంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించనున్నారు. ఇకపై ఈరోజు నుంచి నెలలో పదిహేను రోజుల పాటు రెండు పూటల చౌక ధరల దుకాణాలు తెరిచే ఉంటాయి. రేషన్ సరుకులను పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

పదిహేను రోజులు రెండు పూటల...
ప్రతి నెల ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకూ ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకూ, సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకూ డీలర్లు దుకాణాలను తెరిచే ఉంచాల్సి ఉంటుంది. రేషన్ కార్డు దారులు రేషన్ దుకాణాల వద్దకు వెళ్లి సరుకులును తెచ్చుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క కుటుంబం పనికి వెళ్లి వచ్చినా ఇబ్బంది పడకుండా రాత్రి ఎనిమిది గంటల వరకూ తెరిచి ఉంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.


Tags:    

Similar News