Breaking : తిరుమల శ్రీవారి మెట్ల మార్గంలో చిరుత

తిరుమల శ్రీవారి మెట్ల మార్గంలో చిరుత కనిపిచడంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు.

Update: 2025-06-01 04:03 GMT

తిరుమల శ్రీవారి మెట్ల మార్గంలో చిరుత కనిపిచడంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు.భయపడిన భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు సమాచారం అందించారు. 500వ మెట్ల వద్ద చెట్ల పొదల్లో ఉన్న చిరుతను గమనించిన భక్తులు సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు సైరన్ మోగించి చిరుతను అడవుల్లోకి పంపారు.

కాలినడకన వచ్చే...
తర్వాత అరగంట తర్వాత భక్తులను కాలినడకన తిరుమలకు చేరుకునేందుకు అనుమతి ఇచ్చారు. భక్తులను బృందాలుగా వెళ్లాలంటూ తిరుమల తిరుపతి దేవస్థానం సెక్యూరిటీ అధికారులు కోరుతున్నారు. ఇటీవల తిరుమల ఘాట్ రోడ్ లో చిరుత కనిపించింది. దీంతో వరసగా చిరుతలు కనిపిస్తుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తగిన చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.


Tags:    

Similar News