కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారి ఆలయానికి శుక్రవారం వేకువ జాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు

Update: 2025-07-11 06:21 GMT

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారి ఆలయానికి శుక్రవారం వేకువ జాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. పవిత్ర కృష్ణ నదిలో స్నానమాచరించి ఘాట్ రోడ్డు, మహా మండపం మీదగా కొండపైకి భక్తులు చేరుకుంటున్నారు. దుర్గమ్మ వారిని దర్శించుకుని భక్తులు తమ కోరికలు తీరిన నేపథ్యంలో వారి మొక్కులు సమర్పించుకుంటున్నారు. కనకదుర్గమ్మను ఇంటి ఆడపడుచుగా భావించి శుక్రవారం రోజున ఆషాఢ సారె సమర్పణ నిమిత్తం ఆలయం నకు వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులతో ఇంద్రకీలాద్రి కళ కళ లాడింది.

ఆషాఢం సారె...
ఇంటి ఆడపడుచుకు ఏ విధంగా సారె సంభారములు పెడతారో అంతకంటే శ్రద్దగా, భక్తి తో భక్త బృందాలు సామాగ్రి తో తరలి వచ్చారు. శుక్రవారం ఉదయం మేళతాళాలు, మంగళ వాయిధ్యాలు నడుమ సుమారు 100 మందికి పైగా సభ్యులు గల బృందాలు విశేషరీతిలో విచ్చేశారు. మహా మండపం ఆరవ అంతస్తు వద్ద సిబ్బంది ప్రత్యేక విధులు నిర్వహించారు. భక్తులకు ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు ఆలయ అధికారులతో సిబ్బందితో ఈవో శీను నాయక్ సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. శుక్రవారం 11 గంటల సమయానికి భక్తులతో ఇంద్రకీలాద్రి కిటికీలాడుతోంది. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు ప్రసాదాలు అందజేస్తున్నారు


Tags:    

Similar News