ఆ కుర్రాడికి లక్ష రూపాయలు ఇచ్చిన డిప్యూటీ సీఎం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ విద్యార్థి ట్యాలెంట్ కు ఫిదా అయ్యారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ విద్యార్థి ట్యాలెంట్ కు ఫిదా అయ్యారు. అతి తక్కువ ఖర్చుతో, బ్యాటరీతో నడిచే సైకిల్‌ను రూపొందించిన విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్ విద్యార్థి రాజాపు సిద్ధూని పవన్ కళ్యాణ్ అభినందించారు. సిద్ధూ గురించి సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అతడిని మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడారు. అతని ఆలోచనలకు మరింత పదునుపెట్టాలని ఆకాంక్షిస్తూ లక్ష ప్రోత్సాహకం అందించారు. ఆ సైకిల్‌పై సిద్ధూని కూర్చోబెట్టుకొని నడిపారు. ఈ సైకిల్‌ను మూడు గంటలు పాటు ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్లు ప్రయాణించగలదని సిద్ధూ చెప్పాడు.