Pawan Kalyan : చంద్రబాబు వల్లనే అది సాధ్యమయింది
పింఛన్ల పంపిణీ విజయవంతంగా సాగడం హర్షణీయమని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు
పింఛన్ల పంపిణీ విజయవంతంగా సాగడం హర్షణీయమని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి పాలన ప్రారంభమయ్యాక పెంచిన సామాజిక పింఛన్లను రెండో నెలలోనూ విజయవంతంగా లబ్ధిదారులకు ఇంటి దగ్గరే పంపిణీ చేశారన్నారు. 64 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు రూ.2737.4 కోట్ల మొత్తాన్ని ఈ రోజు ఉదయం నుంచీ ఇంటింటికీ వెళ్ళి పెన్షన్లు అందించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రూపొందించిన కార్యక్రమం ప్రజలకు చేరువైందని పవన్ కల్యాణ్ తెలిపారు.
పింఛన్ల పంపిణీ...
అందరూ హర్షించేలా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని తీసుకువచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నానని ఆయన తెలిపారు. గత పాలకులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేసినా సంక్షేమ పథకాల అమలుకి ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.