Pawan Kalyan : పవన్ వార్నింగ్ మామూలుగా లేదుగా
జగన్ పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో వివాదాస్పద ఫ్లెక్సీలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు
జగన్ పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో వివాదాస్పద ఫ్లెక్సీలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. రప్పా రప్పా నరుకుతాం అని ఫ్లెక్సీలు కట్టడం పై అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమా డైలాగ్‌లు సినిమా హాలు వరకే బాగుంటాయన్న పవన్ కల్యాణ్ సినిమా డైలాగ్‌లు ఆచరించడం ప్రజాస్వామ్యంలో కుదరదని అన్నారు.
ఎవరైనా చట్టం ప్రకారం...
ఎవరైనా చట్టం, నిబంధనలు పాటించాల్సిందేనన్న పవన్ కల్యాణ్ శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిని ఉపేక్షించేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. రౌడీషీట్లు తెరిచి అసాంఘిక శక్తులను అదుపుచేస్తామని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటమూ నేరమేనని పవన్ కల్యాణ్ జగన్ ను గురించి పరోక్షంగా వ్యాఖ్యానించారు.