Breaking : తిరుమల లడ్డూపై తొలిసారి రెస్పాండ్ అయిన పవన్
తిరుమల లడ్డూ వివాదంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. ఆయన ఎక్స్ లో తన అభిప్రాయాన్ని పోస్టు చేశారు.
pawan kalyan
తిరుమల లడ్డూ వివాదంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. ఆయన ఎక్స్ లో తన అభిప్రాయాన్ని పోస్టు చేశారు. తిరుమల లడ్డూలో జంతువుల నూనెను వాడటం విచారకరమన్నారు. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని ఆయన కోరారు.
గత ప్రభుత్వంలో...
దీనిపై గత ప్రభుత్వంలో ఉన్న టీటీడీ బోర్డు కూడా సమాధానం చెప్పాల్పి ఉంటుందని పవన్ కల్యాణ తెలిపారు. ఈ వివాదంలో దోషులపై కఠిన చర్యలు తీసుకోవడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా పవన్ తెలిపారు. దీనిపై జాతీయ స్థాయిలో చర్చ జరగడం అవసరమని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. దేవాలయాల పవిత్రత కోసం సనాతన ధర్మ రక్షణ బోర్డును ఏర్పాటు చేయాలని ఆయన ఆకాంక్షించారు.