Pawan Kalyan : గోటితో పోయే దాన్ని గొడ్డలిదాకా...సంథ్యా థియేటర్ ఘటనపై పవన్
సంధ్యా థియేటర్ లో జరిగిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు.
సంధ్యా థియేటర్ లో జరిగిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. ఆయన ఘటన జరిగిన తర్వాత జరిగిన పరిస్థితులను తప్పుపట్టారు. ఘటన జరగడం దురదృష్టకరమైనా వెంటనే బాధితుల ఇంటికి వెళ్లిపరామర్శించాల్సిందన్నారు. అలా చేయకపోవడం వల్లనే లేనిపోని అపోహలకు తావిచ్చినట్లయిందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. అభిమాని మృతి చెందిన వెంటనే వారి కుటుంబాన్ని పరామర్శించడం బాధ్యతగా తీసుకుని ఉంటే బాగుండేదనిపవన్ కల్యాణ్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని కేసు పెట్టారనడం సరికాదని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.
పరామర్శకు ...
అల్లు అర్జున్ పరామర్శకు వెళ్లకపోయినా పుష్ప టీం వారి ఇంటికి వెళ్లి బాధితులతో మాట్లాడి వారిని పరామర్శించి భరోసా ఇచ్చి ఉంటే ఇక్కడి దాకా వచ్చేది కాదని పవన్ కల్యాణ్ అన్నారు. గోటిపోయే దాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్న తర్వాత బాధపడి ప్రయోజనమేంటని పవన్ కల్యాణ్ ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తప్పుపట్టాల్సిన పని లేదన్నారు. అల్లు అర్జున్ రేవంత రెడ్డి స్థానంలో ఉన్నా అదే చేసేవారన్నారు. మానవతా థృక్పధం లేదని అర్ధమయిందని, చట్టం ఎవరికీ చుట్టం కాదని పవన్ కల్యాణ్ అన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి రేవంత్ కృషి చేశారన్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now