ఉప్పాడలో మత్స్యకారుల ఆందోళనపై పవన్ రియాక్షన్ ఇదే

కాకినాడ జిల్లా ఉప్పాడలో ఫార్మా పరిశ్రమల కాలుష్యంపై మత్స్యకారులు చేస్తున్న ఆందోళనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు.

Update: 2025-09-24 07:43 GMT

కాకినాడ జిల్లా ఉప్పాడలో ఫార్మా పరిశ్రమల కాలుష్యంపై మత్స్యకారులు చేస్తున్న ఆందోళనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రభుత్వానికి మత్స్యకారుల సమస్యలు తెలుసన్న పవన్ కల్యాణ్, పరిష్కారానికి చర్యలు ప్రారంభించామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున తాను వ్యక్తిగతంగా ఆందోళనకారులను కలవలేకపోయానని పవన్ స్పష్టం చేశారు.

కమిటీని ఏర్పాటు చేసి...
అయితే రాష్ట్ర, జిల్లా అధికారులతో ఇప్పటికే చర్చలు జరిపినట్లు పవన్ కల్యాణ్ వివరించారు. కాలుష్య నియంత్రణ మండలి, మత్స్యశాఖ, రెవెన్యూ, పరిశ్రమల శాఖల ఉన్నతాధికారులు, కాకినాడ కలెక్టర్‌తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, మత్స్యకారుల ప్రతినిధులతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పవన్ కల్యాణ్ ప్రకటించారు.


Tags:    

Similar News