వైసీపీ నేతలకు పవన్ మళ్లీ స్ట్రాంగ్ వార్నింగ్
వైసీపీ నేతలకు మరోసారి ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హెచ్చరించారు
వైసీపీ నేతలకు మరోసారి ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హెచ్చరించారు.ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే వదిలపెట్టబోనని వార్నింగ్ ఇచ్చారు. అధికారులను బెదిరిస్తే తాను ఊరుకునేది లేదని అన్నారు. విమర్శలు చేయవచ్చు కాని, బెదిరించడం మానేయాలని అన్నారు. రైడీలను, గంజాయిలను వెనకేసుకు వస్తే ఊరుకునేది లేదని అన్నార. తప్పదు అనుకుంటే గొడవకు దిగడానికి కూడా తాము సిద్ధమవుతానని పవన్ కల్యాణ్ తెలిపారు.
బెదిరిస్తే ఊరుకోం...
అధికారులను, కాంట్రాక్టర్లను బెదిరించి అభివృద్ధిని అడ్డుకుంటామని అంటే చూస్తూ ఊరుకోవడానికి తాము సిద్ధంగా లేమని పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్రంలో టూరిజం డెవలెప్ కావాలంటే లా అండ్ ఆర్డర్ ముఖ్యమని అన్న పవన్ కల్యాణ్, శాంతి భద్రతల పరిరక్షించడం కోసం రాజీ పడబోమని పవన్ కల్యాణ్ అన్నారు. ఎవరూ అనవసరంగా గొడవలకు దిగవద్దని, అలాగని విమర్శలకు సరైన రీతిలో సమాధానం చెప్పాలని జనసేన నేతలకు పవన్ కల్యాణ్ తెలిపారు.