Andhra Pradesh : తురకపాలెంలో మరొకరు మృతి
గుంటూరు జిల్లాలో తురకపాలెం లో మరణాల సంఖ్య ఆగడం లేదు. మరో మహిళ మరణించడంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
గుంటూరు జిల్లాలో తురకపాలెం లో మరణాల సంఖ్య ఆగడం లేదు. మరో మహిళ మరణించడంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో గత కొద్ది నెలల నుంచి దాదాపు ముప్ఫయి మందికి పైగానే మరణించారు. అయితే ఇటీవల ప్రభుత్వం అక్కడ వైద్య శిభిరాలను ఏర్పాటు చేయడమే కాకుండా, ఎమ్మెల్యే కూడా పల్లె నిద్ర చేశారు. కొన్ని రోజుల పాటు వారికి భోజనంతో పాటు మంచినీటిని కూడా అందించారు.
మహిళ మృతి చెందడంతో...
తాగునీటిలో ఏదైనా ఇబ్బందులున్నాయేమోనని భావించి వాటిని పరీక్షలకు పంపారు. తాజాగా తురకపాలెంలో ఒక మహిళకు తీవ్రమైన జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించడారు. దీంతో తురకపాలెంలో మరణాలు ఆగలేదని గ్రామస్థులు వాపోతున్నారు. మరోసారి మరణం సంభవించడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.