Andhra Pradesh : ఏపీలో గ్రూప్ 2 మెయిన్ పరీక్షకు నిబంధనలివే
ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు తేదీ ఖరారయింది.
ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు తేదీ ఖరారయింది. ఈ నెల 23వ తేదీన ఏపీలో గ్రూప్ 2 మెయిన్ పరీక్ష నిర్వహించాలని ఏపీపీఎస్సీ అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ పరీక్షకుకు 92,250 మంది అభ్యర్థులు సాధించినట్లు ఏపీపీఎస్సీ అధికారులు ప్రకటించారు. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను రెండు పేపర్లుగా నిర్వహించనున్నారు.
రెండు పేపర్లుగా...
అభ్యర్థులు ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని తెలిపారు. పేపర్ -1 పరీక్ష ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ జరుగుతుంది. పేపర్ -2 పరీక్ష మధ్యాహ్నం మూడు గంటల నంుచి సాయంత్రం 5.30 గంటల వరకూ జరుగుతుందని అధికారులు తెలిపారు.