Cyclone Alert : రాత్రికి తుపాను గా మారే ఛాన్స్

శ్రీలంక తీరంలో తీవ్ర వాయు గుండం బలపడుతుంది.

Update: 2025-11-27 07:31 GMT

శ్రీలంక తీరంలో తీవ్ర వాయు గుండం బలపడుతుంది. సాయంత్రం లేదా రాత్రికి తుపాను గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను కి సెన్యార్ గా నామకరణం చేశారు. తమిళనాడు, దక్షిణ కోస్తా వైపు తుపాను పయనించనుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఎల్లుండి నుంచి ఉభయ గోదావరి, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని చెప్పింది.

భారీ నుంచి అతి భారీ వర్షాలు...
అయితే మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు కొన్ని ప్రాంతాల్లోనూ, మరికొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని సూచించారు. సముద్ర తీర ప్రాంతంలో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.


Tags:    

Similar News