రైల్వే శాఖ కీలక నిర్ణయం.. మొంథా తుపాను ఎఫెక్ట్.. రైళ్లు రద్దు

తుపాను ఎఫెక్ట్ తో రైల్వే శాఖ చాలా రైళ్లను రద్దు చేసింది

Update: 2025-10-27 12:48 GMT

తుపాను ఎఫెక్ట్ తో రైల్వే శాఖ చాలా రైళ్లను రద్దు చేసింది. మూడు రోజుల పాటు ఈ రైళ్లు రద్దయినట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. మొంథా తుపాన్‌ ఆంధ్ర తీరాన్ని తాకబోతున్న నేపథ్యంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే, విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో ఎక్కువగా రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింతి. తుపాను ప్రభావంతో ముందస్తు చర్యగా 43 రైళ్లను రద్దు చేసింది. అక్టోబర్‌ 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మీదుగా నడిచే ఈ రైళ్లు రద్దు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రయాణికుల ఇబ్బందులు నివారించడమే కాక, రైళ్ల కార్యకలాపాలు సజావుగా సాగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వేశాఖ అధికారులు తెలిపారు. ప్రయాణికుల భద్రత కోసం ముందస్తు చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.

రద్దయిన రైళ్లు ఇవే:
18515 విశాఖపట్నం–కిరండూల్‌ నైట్‌ ఎక్స్‌ప్రెస్‌ (అక్టోబర్‌ 27)
18516 కిరండూల్‌–విశాఖపట్నం నైట్‌ ఎక్స్‌ప్రెస్‌ (అక్టోబర్‌ 28)
58501 విశాఖపట్నం–కిరండూల్‌ ప్యాసింజర్‌ (అక్టోబర్‌ 28)
58502 కిరండూల్‌–విశాఖపట్నం ప్యాసింజర్‌ (అక్టోబర్‌ 28)
58538 విశాఖపట్నం–కొరాపుట్‌ ప్యాసింజర్‌ (అక్టోబర్‌ 28)
58537 కొరాపుట్‌–విశాఖపట్నం ప్యాసింజర్‌ (అక్టోబర్‌ 28)
18512 విశాఖపట్నం–కొరాపుట్‌ ఎక్స్‌ప్రెస్‌ (అక్టోబర్‌ 27)
18511 కొరాపుట్‌–విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌ (అక్టోబర్‌ 28)
67285 రాజమండ్రి–విశాఖపట్నం MEMU (అక్టోబర్‌ 28)
67286 విశాఖపట్నం–రాజమండ్రి MEMU (అక్టోబర్‌ 28)
17268 విశాఖపట్నం–కాకినాడ ఎక్స్‌ప్రెస్‌ (అక్టోబర్‌ 28)
17267 కాకినాడ–విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌ (అక్టోబర్‌ 28)
08583 విశాఖపట్నం–తిరుపతి స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ (అక్టోబర్‌ 27)
08584 తిరుపతి–విశాఖపట్నం స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ (అక్టోబర్‌ 28)
22875 విశాఖపట్నం–గుంటూరు యూడే డబుల్‌డెక్కర్‌ (అక్టోబర్‌ 28)
22876 గుంటూరు–విశాఖపట్నం యూడే డబుల్‌డెక్కర్‌ (అక్టోబర్‌ 28)
22707 విశాఖపట్నం–తిరుపతి డబుల్‌డెక్కర్‌ (అక్టోబర్‌ 27)
18526 విశాఖపట్నం–బ్రహ్మపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (అక్టోబర్‌ 27)
18525 బ్రహ్మపూర్‌–విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌ (అక్టోబర్‌ 28)
17243 గుంటూరు–రాయగడ ఎక్స్‌ప్రెస్‌ (అక్టోబర్‌ 27)
17244 రాయగడ–గుంటూరు ఎక్స్‌ప్రెస్‌ (అక్టోబర్‌ 27)
67289 విశాఖపట్నం–పలాసా MEMU (అక్టోబర్‌ 28)
67290 పలాసా–విశాఖపట్నం MEMU (అక్టోబర్‌ 28)
67287 విశాఖపట్నం–విజయనగరం MEMU (అక్టోబర్‌ 27)
67288 విజయనగరం–విశాఖపట్నం MEMU (అక్టోబర్‌ 28)
68433 కటక్–గునుపూర్‌ MEMU (అక్టోబర్‌ 28)
68434 గునుపూర్‌–కటక్ MEMU (అక్టోబర్‌ 29)
58531 బ్రహ్మపూర్‌–విశాఖపట్నం ప్యాసింజర్‌ (అక్టోబర్‌ 28)
58532 విశాఖపట్నం–బ్రహ్మపూర్‌ ప్యాసింజర్‌ (అక్టోబర్‌ 28)
58506 విశాఖపట్నం–గునుపూర్‌ ప్యాసింజర్‌ (అక్టోబర్‌ 28)
58505 గునుపూర్‌–విశాఖపట్నం ప్యాసింజర్‌ (అక్టోబర్‌ 28)
17220 విశాఖపట్నం–మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌ (అక్టోబర్‌ 27)
12727 విశాఖపట్నం–హైదరాబాద్‌ గోదావరి ఎక్స్‌ప్రెస్‌ (అక్టోబర్‌ 27)
12861 విశాఖపట్నం–మహబూబ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్‌ (అక్టోబర్‌ 27)
12862 మహబూబ్‌నగర్‌–విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌ (అక్టోబర్‌ 28)
22869 విశాఖపట్నం–చెన్నై సెంట్రల్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ (అక్టోబర్‌ 27)
22870 చెన్నై సెంట్రల్‌–విశాఖపట్నం వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ (అక్టోబర్‌ 28)
12739 విశాఖపట్నం–సికింద్రాబాద్‌ గరీఫ్‌ రత్‌ ఎక్స్‌ప్రెస్‌ (అక్టోబర్‌ 27)
20805 విశాఖపట్నం–న్యూఢిల్లీ ఏపీ సూపర్‌ఫాస్ట్‌ (అక్టోబర్‌ 27)
20806 న్యూఢిల్లీ–విశాఖపట్నం ఏపీ ఎక్స్‌ప్రెస్‌ (అక్టోబర్‌ 29)
22707 విశాఖపట్నం–తిరుపతి డబుల్‌డెక్కర్‌ (అక్టోబర్‌ 27)
18519 విశాఖపట్నం–లోక్‌మాన్య తిలక్‌ టెర్మినస్‌ ఎక్స్‌ప్రెస్‌ (అక్టోబర్‌ 27)
18520 లోక్‌మాన్య తిలక్‌ టెర్మినస్‌–విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌ (అక్టోబర్‌ 29)












Tags:    

Similar News