Andhra Pradesh : ఈ నెల 31 వరకూ విద్యాసంస్థలకు సెలవులు
ఆంధ్రప్రదేశ్ లోని విద్యాసంస్థలకు సెలవులను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ లోని విద్యాసంస్థలకు సెలవులను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొంథా తుపాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు ఈ నెల 31వ తేదీ వరకూ సెలవులు కొనసాగుతాయని ప్రభుత్వం ప్రకటించింది. ప్రధానంగా కోస్తాతీర ప్రాంతంలో ఉన్న జిల్లాల్లో భారీ వర్షం పడుతుంది. అనేక చోట్ల రహదారులు జలమయమయ్యాయి.
భారీ వర్షాలతో...
ప్రకాశం, నెల్లూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతుండటంతో ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. తుపాను ప్రభావం మరికొద్ది రోజుల పాటు ఉంటుందని భావించి ఈ నెల 31వ తేదీ వరకూ సెలవులు ప్రకటిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.