Cyclone Michoung : మూతబడిన జాతీయ రహదారి

మిచౌంగ్ తుఫానుతో జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి

Update: 2023-12-05 06:46 GMT

మిచౌంగ్ తుఫానుతో జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. మరికొద్ది గంటల్లో తీరం దాటుతుండటంతో భారీ వర్షాలు కురుస్తుండటంతో జాతీయ రహదారిపైకి నీళ్లు నిలిచాయి. దీంతో నెల్లూరు వద్ద జాతీయ రహదారిపై రాకపోకలను అధికారులు నిలిపేశారు. రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశముండటంతో పాటు భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా జాతీయ రహదారిపై రాకపోకలను ఆపేశారు.

రాకపోకలు బంద్...
నిన్నటి నుంచే చెన్నై నుంచి నెల్లూరుకు మధ్య రాక పోకలు నిలిచిపోయాయి. జాతీయ రహదారి పైకి నీళ్లు నిలిచిపోవడంతో వాహనాలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. రాకపోకలు బంద్ కావడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. భారీగా ఈదురుగాలులు వీస్తుండటంతో చెట్లు కూడా హైవే పై పడే అవకాశాలున్నాయని హెచ్చరికలు జారీ అవుతున్నాయి.


Tags:    

Similar News